Oct 26,2021 21:33

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. కార్పొరేట్‌ సంస్థల ఆశాజనక ఫలితాల నేపథ్యంలో వరుసగా రెండో రోజూ సూచీలు లాభాలు పొందాయి. దీనికితోడు అంతర్జాతీయ పరిణామాలు సైతం సానుకూలంగా ఉండటం కలిసొచ్చిందని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో బిఎస్‌ఇ సన్సెక్స్‌ 383 పాయింట్లు లాభపడి, 61,350 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ సైతం 143 పాయింట్ల లాభంతో 18,268 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఎస్‌బిఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, టైటాన్‌ కంపెనీ, జెఎస్‌డబ్ల్యు స్టీల్‌ తదితర షేర్లు లాభపడగా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంకు, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌యుఎల్‌, ఎన్‌టిపిసి షేర్లు నష్టాలను చవిచూశాయి.