Oct 27,2021 15:07

కువైట్‌ సిటీ  :  చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న విదేశీయులపై కువైట్‌ ఉక్కుపాదం మోపింది. రెసిడెన్సీ గడువు ముగిసిన ఇంకా కువైట్‌లోనే ఉంటున్న వలసదారులను గుర్తించి వారి దేశాలకు పంపిస్తున్నారు. అలాగే ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన వారిని కూడా దేశం నుంచి బహిష్కరిస్తున్నారు అక్కడి అధికారులు. గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 600 మందికి పైగా ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టింది. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు సుమారు 662 మంది వలసదారులను దేశం నుండి బహిష్కరించినట్లు సమాచారం. వీరందరూ వివిధ ఉల్లంఘనలకు పాల్పడినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 447 మంది పురుషులు, 215 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది.