Oct 14,2021 06:56

నీ కలం...
కలకాలం కష్టజీవుల
కన్నీళ్ళు తుడవాలి

నీ కలం...
బాధాతప్త హృదయాలకు
సేద తీర్చాలి

నీ కలం...
పెత్తందారుల కుత్తుకలపై
రంపపు కత్తి కావాలి

నీ కలం...
రైతన్న వెతలకు
భరోసా ఇవ్వాలి

నీ కలం...
కార్మిక లోకానికి
బాసటగా నిలవాలి

నీ కలం...
రొచ్చు రాజకీయాలకి
చరమ గీతం పాడాలి

నీ కలం...
ఆడబిడ్డల రక్షణకు
కవచంగా మారాలి

నీ కలం ఖడ్గంగా మారి
జబ్బు పడ్డ వ్యవస్దకు
శస్త్ర చికిత్స చేయాలి.

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్‌ : 9441791239