Jan 28,2021 00:27

రైతులతో మాట్లాడుతున్న ఆర్‌.శ్రీనివాసులునాయుడు

ప్రజాశక్తి-టంగుటూరు: పొగాకు రెలిచిన పిదప పచ్చాకు బ్యారన్‌ క్యూరింగ్‌ దశలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని ఒంగోలు దక్షిణ ప్రాంత నల్ల రేగడి నేలల ప్రాంతీయ కార్యాల యం అధికారి ఆర్‌.శ్రీనివాసులు నాయు డు సూచించారు. బుధవారం టంగుటూరు వేలం కేంద్రంలో 24 పరిధిలో మండలంలోని శివపురం, తూర్పునాయుడుపాలెం, కారుమంచి, మల్లవరపుపాడు, ఎం.నిడమలూరు, పొందూరు తదితర గ్రామాలలోని పొగాకు తోటలు, బ్యారన్‌లలో క్యూరింగ్‌ తీరును క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి ఆర్‌ఎం పరిశీలించారు. పొగాకు తోటలు బెట్టకు రావడం, నేల గట్టిపడడం, ఆకులను రెలచడం వంటి సమస్యలను గుర్తించారు. తగిన జాగ్రత్తలను ఆర్‌ఎం శ్రీనివాసులునాయుడు రైతులకు వివరించారు. ఆయన వెంట వేలం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు, ఐటిసి, జిపిఐ, పోలిశెట్టి, అలియన్స్‌ కంపెనీల ప్రతినిధులు ఎస్‌.మతివణ్ణన్‌, బి.రవి, ఎన్‌.నాగేంద్ర, జి.ఆంజనేయులు పాల్గొన్నారు. కొండపి: కొండపి వేలం కేంద్ర పరిధిలోని చతుకుపాడు, కామేపల్లి, నేతివారిపాలెం, కట్టావారిపాలెం, కొండపి, ముప్పవరం, వెన్నూరు, రామచంద్రపూరం, నర్సింగోలు గ్రామాల్లోని పొగాకు తోటలను, క్యూరింగ్‌ పొగాకును ఒంగోలు ఆర్‌ఎం శ్రీనివాసులనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ పొగాకు తోటలలో పక్వానికి వచ్చిన ఆకులను మాత్రమే రెలపాలని తెలిపారు. గ్రేడింగ్‌ సమయంలో అన్య పదార్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట కొండపి వేలం నిర్వహణాధికారి ఎస్‌.రామారావు, ఐటిసి శాస్త్రవేత్త పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.