May 16,2021 08:11
  • రూ.2 కోట్ల జీతం
  • మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగానికి ఎంపికైన హైదరాబాద్‌ యువతి

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : హైదరాబాద్‌కు చెందిన నర్కుటీ దీప్తి క్యాంపస్‌ ఇంటర్వ్యూలో జాక్‌పాట్‌ కొట్టేసింది. రూ.2 కోట్ల జీతం ఉద్యోగానికి ఎంపికైంది. ఎంఎస్‌ కంప్యూటర్స్‌ పూర్తి చేసిన దీప్తి మైక్రోసాఫ్ట్‌ హెడ్‌ కంపెనీ హెడ్‌ బ్రాంచ్‌లో సదరు వేతనంతో ఉద్యోగం సంపాదిం చింది. దీప్తి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని క్లూస్‌ టీమ్స్‌ హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ వెంకన్న కుమార్తె. 2019లో జెపి మోర్గాన్‌ మల్టీనేషన్‌ల్‌ కంపెనీలో పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఉన్నత చదువుల కోసం ఆమె అమెరికా వెళ్లింది. అక్కడ యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలో కంప్యూటర్స్‌లో మాస్టర్స్‌ చేసేందుకు చేరింది. రెండేళ్ల కాల వ్యవధితో ఎంఎస్‌ (కంప్యూ టర్స్‌)ను ఈ నెల 2న పూర్తి చేసింది. కోర్సు పూర్తికాక ముందే క్యాంపస్‌ ఇంటర్వ్యూలు జరిగాయి. గోల్డ్‌మన్‌ సాక్స్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు ఆమెను ఉద్యోగంలోకి తీసుకోవడానికి ముందుకొచ్చాయి. ఆమె మాత్రం మైక్రోసాఫ్ట్‌ వైపు మొగ్గుచూపింది. సాధారణంగా ఎంఎస్‌ చేస్తున్న విద్యార్థులకు న్యూగ్రేడ్‌ పొజిషన్‌ కింద ఉద్యోగానికి వివిధ కంపెనీలు ఆఫర్‌ చేస్తుంటాయి. అందుకు భిన్నంగా దీప్తి ఎస్‌డిఒ (సాఫ్ట్‌వేర్‌ డెవెలప్‌మెంట్‌ ఇంజినీర్‌) గ్రేడ్‌-2కి ఎంపికైంది. ఒక తెలుగు విద్యార్థిని ఎస్‌డిఇ గ్రేడ్‌-2కు ఎంపిక కావడం ఫ్లోరిడా యూనివర్శీటీ లెక్చరర్లను, విద్యార్థులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. సుమారు 300 మంది విద్యార్థుల్లో అత్యధిక జీతంతో దీప్తి ఉద్యోగా నికి ఎంపిక కావడం పట్ల తోటి విద్యార్థులు, ఉపాధ్యా యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 17న వాషింగ్టన్‌లోని సియాటెల్‌ నగరంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టనుందని ఆమె తండ్రి వెంకన్న తెలిపారు.