Nov 25,2021 21:09

అక్సెల్సన్‌ చేతిలో ఓడిన శ్రీకాంత్‌
బాలి: ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌100 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి పివి సింధు ప్రవేశించగా.. కిదాంబి శ్రీకాంత్‌ ఓటమిపాలయ్యాడు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో సింధు 21-12, 21-18 పాయింట్ల తేడాతో జర్మనీకి చెందిన యొన్నె లీని చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌ను సింధు కేవలం 37 నిమిషాల్లోనే ముగించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో ఉన్న సింధు తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచినా.. రెండో సెట్‌లో జర్మనీ షట్లర్‌ పుంజుకోవడంతో సింధు చెమటోడ్చాల్సి వచ్చింది. క్వార్టర్స్‌లో సింధు.. సిమ్‌ాయుజిన్‌(కొరియా)తో తలపడనుంది.
టాప్‌సీడ్‌ మొమొటో ఔట్‌..
పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌, జపాన్‌కు చెందిన కెంటో మొమొటో రెండోరౌండ్‌లో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో మొమొటో 7-21, 21-17, 19-21 తేడాతో కెన్‌ాయు(సింగపూర్‌) చేతిలో పోరాడి ఓడాడు. ఇరువురు షట్లర్ల మధ్య ఈ పోటీలో గంటకుపైగా సాగింది. మరో పోటీలో భారత్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్‌ 12-21, 18-21 తేడాతో విక్టర్‌ అక్సెల్సన్‌(డెన్మార్క్‌) చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.