Jan 14,2022 21:17

భారత్‌ × దక్షిణాఫ్రికా మ్యాచ్‌ నేడే
రా.6.30 గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

గయానా: ఐసిసి అండర్-19 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ తొలి మ్యాచ్‌ను నేడు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఎలైట్‌ గ్రూప్‌లో భాగంగాలో గ్రూప్‌ాబిలో ఉన్న భారత్‌ ఇదే గ్రూప్‌లో ఉన్న ఐర్లాండ్‌, ఉగాండాలతోనూ తలపడనుంది. ఎలైట్‌ గ్రూప్‌లలో ఉన్న నాలుగు జట్లు లీగ్‌లో మిగతా జట్లతో మ్యాచ్‌లు ముగిసిన అనంతరం రెండేసి జట్లు క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించనున్నాయి. భారతజట్టు అండర్-19 ప్రపంచకప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు కైవసం చేసుకుంది. 2020లో ఫైనల్‌కు చేరినా.. అనూహ్యంగా బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపుచ్చుకుంది.
గ్రూప్‌ాఏ: ఇంగ్లండ్‌, యుఏఇ, బంగ్లాదేశ్‌, కెనడా
గ్రూప్‌ాబి: ఇండియా, ఐర్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఉగాండా
గ్రూప్‌ాసి: పప్పున్యుగేనియా, పాకిస్తాన్‌, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్‌
గ్రూప్‌ాడి: వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌, శ్రీలంక.