Dec 01,2021 06:52

సాకీ:
కార్తీకం కార్తీకం కలిపేదే కార్తీకం
కులం కులం కులమంటు
విడగొట్టదు కార్తీకం
చేయిచేయి కలపమని
చెప్పింది కార్తీకం
చేయిచేయి కలపమని
చెప్పింది కార్తీకం


పల్లవి:
అందరు కలసి చేద్దాం రండి
సరదా సరదా వనభోజనము
కులమే లేదు మతమే లేదు
కులమే లేదు మతమే లేదు
ఉన్నది ఒకటే మానవత్వము
ఉన్నది ఒకటే మానవత్వము //అందరు//


చరణం 1:
కులాల మతాల రొచ్చుగుంటలో
దింపేవాళ్ళకు దూరంగుందాం
ఓటు కోసము నోటు కోసము
విడదీసే జనులకు దూరంగుందాం
అసలైన భారతం మనదేనంటు
అందరు కలిసి హాయిగ ఉందాం
అందరు కలిసి హాయిగ ఉందాం //అందరు//


చరణం 2:
సీట్లు వాళ్ళవి గద్దె వాళ్ళది
మనల విడదీయు కుటిలం వాళ్ళది
ప్రజల బాగుని పక్కన పెట్టి
నాటకమాడే తంత్రం వాళ్ళది
తమాష చూసే బుద్ధివాళ్ళది
తమాష చూసే బుద్ధివాళ్ళది //అందరు//


చరణం 3:
అందుకె అందరమొకటవుదాము
కులం మతం లేక చేయి కలుపుదాం
భావిభారతికి దారిని చూపి
చక్కని బతుకును ఆస్వాదిద్దాం
బహు కమ్మగ దానిని ఆహ్వానిద్దాం
విందున దానిని స్వాగతిద్దాం
విందున దానిని స్వాగతిద్దాం //అందరు//


- జంధ్యాల రఘుబాబు,
సెల్‌ : 9849753298