
సంఘీభావం తెలుపుతున్న సంఘం నాయకులు
ప్రజాశక్తి-అమలాపురం : బేడ బుడగ జంగాలకు ఎస్సి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని బేడ బుడగ జంగాల సంఘం జిల్లా అధ్యక్షులు మోటూరి రాము ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం అమలా పురం బుద్ధ విహార్లో నిర్వహించిన సమావేశంలో రాము మాట్లాడారు. రాజ్యాంగంలో 59 కులాల్లో బేడ బుడగ జంగం కూడా ఒక కులమని ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దుర్గాప్రసాద్, పెద్దిరాజు, పిచ్చయ్య, నాగరాజు, కొండయ్య, వెంకన్న పాల్గొన్నారు.