Jan 26,2021 07:42

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఆర్మీ హెలికాఫ్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్‌ మరణించగా, మరో పైలెట్‌కు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన పైలెట్‌ను ఆస్పత్రికి తరలించారు. అత్యాధునిక లైట్‌ హెలికాఫ్టర్‌ ధ్రువ్‌ పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ నుండి వస్తోందని అన్నారు. కథువాలోని లఖన్‌పూర్‌ వద్ద హెలికాఫ్టర్‌ కూలిపోయిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి శైలేంద్ర మిశ్రా ధ్రువీకరించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.