Nov 30,2020 22:45

సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ వినోద్‌ కుమార్‌

- నిందితుల అరెస్టు
ప్రజాశక్తి - కోసిగి రూరల్‌:
 మండలంలోని కోలమాన్‌ పేట గ్రామంలో నవంబర్‌ 25న కిందింటి గోవిందు (55)ను వేట కొడవలితో తలపై నరికి, గొంతు కోసి హత్య చేసిన కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వినోద్‌ కుమార్‌ మాట్లాడారు. సిఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ ధనుంజరు సిబ్బందితో కలిసి పూర్తిస్థాయిలో విచారించినట్లు తెలిపారు. మృతుని భార్య తిక్కమ్మ భర్త గోవిందును వేట కొడవలితో నరికి చంపారని చెప్పారు. నిందితురాలు తిక్కమ్మను ఇంటి వద్దనే అరెస్టు చేసినట్లు తెలిపారు. గోవిందు వికలాంగురాలైన సొంత కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడని, చెప్పినా మారకపోవడంతో తిక్కమ్మ చంపినట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. కోలమాన్‌ పేట విఆర్‌ఒ ముందు నేరం ఒప్పుకున్నందుకు కోసిగి సిఐ ఈశ్వరయ్య ముందు హాజరుపరచినట్లు చెప్పారు. ఆమె నుంచి హత్యకు ఉపయోగించిన వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.