
న్యూఢిల్లీ : భారత ఎగుమతుల రంగం ఇంకా ఒత్తిడిలోనే ఉంది. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో 0.25 శాతం తగ్గి 27.67 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు దిగుమతులు ఏడు శాతం పెరిగి 40.98 బిలియన్ డాలర్లకు చేరాయని మంగళవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. గడిచిన మాసంలో భారత వాణిజ్య లోటు కూడా 12.88 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇంతక్రితం ఏడాది ఇదే నెలలో ఈ లోటు 10.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి కాలంలో భారత ఎగుమతులు మైనస్ 12.32 క్షీణించి 255.92 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2019ా20 ఇదే కాలంలో 291.87 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. గడిచిన 11 మాసాల్లో దిగుమతులు 23 శాతం తగ్గి 340.88 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. క్రితం ఫిబ్రవరిలో చమురు దిగుమతులు 16.63 శాతం పతనమై 8.99 బిలియన్ డాలర్లుగా.. గడిచిన 11 మాసాల్లో 40.18 శాతం కోల్పోయి 72.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.