
ప్రజాశక్తి -శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా నియమితులైన బి.శాంతిశ్రీ డిప్యూటీ సిఎం ధర్మాన కష్ణదాస్ను విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సహకారశాఖ నుంచి డెప్యూటేషన్లో ఆమె శ్రీకాకుళం జిల్లాకు నియమితులయ్యారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగా మంత్రిని కలిసిన ఆమెకు జిల్లా ప్రగతిలో భాగస్వామ్యం కావాలని మంత్రి సూచించారు.