Mar 02,2021 12:30

భోపాల్‌ : కరోనా మహమ్మారి బారిన పడి మధ్యప్రదేశ్‌ బిజెపి ఎంపీ నందకుమార్‌ సింగ్‌ చౌహాన్‌ కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో గత 15 రోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే నందకుమార్‌ మృతిపై బిజెపి శ్రేణులు, నేతలు... ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా 2009-14మధ్య ఐదేళ్ల కాలంలో తప్ప 1996 నుండి చౌహాన్‌ లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు.