Jul 30,2021 21:09

matladutunna mpdo

కరోనా థర్డ్‌ వేవ్‌ పై అప్రమత్తంగా ఉండాలి
ప్రజాశక్తి-అవనిగడ్డ
ముంచుకొస్తున్న కరోనా థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని వైద్య సిబ్బందికి సచివాలయం గ్రామ కార్యదర్శులకు ఎంపీడీవో బియ్యం లక్ష్మీ కుమారి అవగాహన కల్పించారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మూడో విడత కరోనా ప్రమాదం గురించి గ్రామాల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ప్రజలను గుంపులుగా ఒకచోట చేరకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం సిబ్బంది గ్రామ కార్యదర్శులు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు