Oct 27,2021 20:53

థామస్‌ కుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వెల్లడి
హైదరాబాద్‌ : 
దేశంలో పర్యాటకం త్వరలోనే కరోనా ముందు నాటి స్థాయికి పుంజుకోనుందని లీజర్‌ ట్రావెల్‌, థామస్‌కుక్‌ (ఇండియా) వైస్‌ ప్రెసిడెంట్‌ సంతోష్‌ కన్నా విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహమ్మారి ముందుకాలం నాటితో పోల్చితే 55 శాతానికి కోలుకుందన్నారు. తమ సంస్థకు తెలుగు రాష్ట్రాల మార్కెట్లు కీలకంగా ఉన్నాయన్నారు. 2021లో హైదరాబాద్‌ నుంచి పర్యటించడానికి 75 శాతం మంది ఆసక్తి చూపుతున్నారని తమ సర్వేలో తేలిందన్నారు. 2019 సెప్టెంబర్‌తో పోల్చితే 2021 ఇదే మాసంలో దేశీయ ప్రయాణాలు 290 శాతం, అంతర్జాతీయ ప్రయాణాలు 60 శాతం పెరిగాయన్నారు.