May 04,2021 16:08

న్యూఢిల్లీ : కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించడమే ఏకైక మార్గం అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దేశంలో పూర్తి లాక్‌డౌన్‌ విధించడం వల్ల బలహీన వర్గాల ప్రజలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. ప్రధాని మోడీ 2019లో ఎలక్షన్‌ మ్యానిఫెస్టోలో కనీస ఆదాయం పథకం కింద సంవత్సరానికి 72 వేలు ఇస్తామని హామీనిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం బలహీనవర్గాలకి ఆ పథకం కింద డబ్బులిచ్చి.. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి నియంత్రణా చర్యలు సరిగ్గా తీసుకోకపోవడం వల్లే.. కేసులు పెరుగుతున్నాయనీ రాహుల్‌ విమర్శించారు. రాహుల్‌ చేసిన ట్వీట్‌కి కొందరు బిజెపి నేతలు మండిపడుతున్నారు. గతంలో లాక్‌డౌన్‌ను వ్యతిరేకించిన రాహుల్‌గాంధీ.. ఇప్పుడెలా దాన్ని సమర్థిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.