
కర్నూలు కలెక్టరేట్ : జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారా జిల్లాలో కర్నూలు వాసి డాక్టర్ జివి.సందీప్ చక్రవర్తి రాష్ట్రపతి అవార్డును న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో అందుకోనున్నారు. డాక్టర్ సందీప్ చక్రవర్తి కర్నూలు నగరంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ జివి.రాంగోపాల్ తనయుడు కావడం విశేషం. 2014 సంవత్సరంలో ఉత్తమ ర్యాంక్ సాధించి ఐపిఎస్‌కు ఎంపి కయ్యారు. శిక్షణ అనంతరం జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి క్యాడర్ ఎస్పీగా కేటాయించారు. 2018లో రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. మరోసారి రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక కావడం పట్ల జిల్లా ప్రముఖులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.