Oct 28,2021 14:34

ప్రజాశక్తి-బి.కొత్తకోట:
కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పెద్దతిప్ప సముద్రం ఎస్‌ఐ మధు రామచంద్రుడు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఎస్‌ఐ ,వారి సిబ్బంది సహాయంతో జింకల మిట్ట వద్ద రామాపురం పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన పి. నారాయణ రెడ్డిఅనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై కర్ణాటక మద్యం తీసుకొని వెళుతుండగా అతనికి ఆపి తనిఖీలు నిర్వహించారు. అతని వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం , 180 ఎంఎల్‌ 336 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.19,236 ఉంటుందన్నారు. అనంతర కేసు నమోదు చేశామని ఎస్‌ఐ మధు రామచంద్రుడు తెలిపారు. ఈ దాడిలో పోలీస్‌ సిబ్బంది కానిస్టేబుల్‌ మూర్తి నాయక్‌, భద్ర తదితరులు పాల్గొన్నారు.