
బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ ఎంఎల్సి ప్రకాష్ రాథోడ్ సభలో అసభ్య వీడియోలు చూసారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలను రాథోడ్ ఖండించారు. సభలో తాను అడగవలసిన ప్రశ్న వివరాలు గురించి శోధించానని, అసభ్య వీడియోలు చూడలేదని ఆయన వివరణ ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యే లక్ష్మన్ సౌదీ (ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి) కూడా ఇదే విధమైన ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.