Apr 14,2021 17:12

రోహిత్‌శర్మ అభిమానులకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ క్షమాపణలు తెలియజేసింది. ఎలాంటి దురుద్దేశంతో మీమ్‌ను రీపోస్ట్‌ చేయలేదని వివరణ ఇచ్చుకుంది. ఆ చిత్రాన్ని తాము రూపొందించలేదని స్పష్టం చేసింది. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలని తాము భావించలేదని తెలిపింది. ఏదేమైనా తాము పల్టాన్స్‌తోనే ఉన్నామని తెలిపింది. కేవలం సరాదా కోసమే పెట్టామని, ఇంకాస్త మెరుగ్గా పెడితే బాగుండేదని వివరించింది.
కలకత్తా నైట్‌రైడర్లతో మ్యాచుకు ముందు స్విగ్గీ ఓ ట్వీట్‌ చేసింది. పావ్‌బాజీ బండి వద్దకు డైవ్‌ చేసి పావ్‌ తీసుకున్నట్టుగా రోహిత్‌శర్మ చిత్రం పెట్టింది. ఈ క్యాప్షన్‌పై రోహిత్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఫోన్ల నుండి స్విగ్గీయాప్‌ను డిలీట్‌ చేస్తూ తీసిన స్క్రీన్‌షాట్లను పెట్టారు. దీంతో దెబ్బకు స్విగ్గీ క్షమాపణలు తెలిపింది.