
న్యూఢిల్లీ : షార్జా నుండి లక్నో వెళ్లే ఇండిగో విమానం మంగళవారం పాకిస్తాన్లోని కరాచీలో అత్యవరసంగా ల్యాండ్ అయింది. ఒక ప్రయాణికునికి అనారోగ్య సమస్య తలెత్తడంతో కరాచీలో ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ ప్రయాణికుడు అప్పటికే మరణించినట్లు విమానాశ్రయ వైద్యులు ధ్రువీకరించారు. ప్రయాణికుని కుటుంబానికి ఎయిర్లైన్స్ అధికారులు సంతాపం ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో, ఒక భారతీయ ఎయిర్ అంబులెన్స్ ఇంధనం నింపేందుకు ఇస్లామాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.