Oct 27,2021 22:17

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్శిటీ : కోవిడ్‌ కంట్రోల్‌ సెంటర్‌ బుధవారం విడుదల చేసిన మెడికల్‌ బులెటిన్‌ ప్రకారం జిల్లాలో కొత్తగా 84 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,19,154కు చేరింది. మరణాల సంఖ్య 1426కు పెరిగింది. జిల్లాలో యాక్టివ్‌ కేసులు 823 ఉన్నాయి. కోవిడ్‌తో చికిత్స పొందుతూపూర్తిగా కోలుకుని జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,16,905 మంది డిశ్చార్జిఅయ్యారు.