
న్యూఢిల్లీ : 'కోవీషీల్డ్' వ్యాక్సిన్‌పై చెలరేగిన దుమారాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఈ వ్యాక్సిన్ కారణంగా తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని, దీంతో తనకు రూ. ఐదుకోట్లు నష్టపరిహారం ఇవ్వాలంటూ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గన్న ఒక వాలంటీర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఖండిస్తూ.. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని తెలిపింది. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెన్కాతో కలిసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో చెన్నైకి చెందిన 40 ఏళ్ల బిజినెస్మెన్ పాల్గన్నారు. అక్టోబర్ 1న శ్రీరామ్‌చంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలో ఆయనకు టీకా వేశారు. పది రోజుల పాటు ఎటువంటి దుష్ప్రభావాలు కలగలేదు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరారు. అతని ప్రవర్తనలో కూడా పూర్తిగా మార్పులు వచ్చాయి. వెలుతురు, శబ్దాలకు చికాకులు వస్తున్నాయని, దీంతో ఎవరినీ గుర్తించలేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నారని అన్నారు. టీకా దుష్ప్రభావం కారణంగా అతని మెదడు దెబ్బతిందని నోటీసుల్లో పేర్కొన్నారు. టీకా కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అన్ని పరీక్షలు నిర్థారించాయి. దీంతో రెండు వారాల్లోగా రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని, టీకా ఉత్పత్తి, పంపిణీని నిలిపివేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సీరం సంస్థతో పాటు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫర్డ్ ప్రయోగాల విభాగం అధిపతి ఆండ్రూ పోలార్డ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీలోని జెన్నర్ ఇన్స్టిట్యూట్, ఆస్ట్రాజెన్‌కా, శ్రీరామ్ చంద్ర ఇన్స్టిట్యూట్కి కూడా నోటీసులు పంపారు.
ఉద్దేశపూర్వకంగానే ఈ ఆరోపణలు చేశారని, దీనిపై రూ. 100 కోట్లకు పైగా పరిహారాన్ని కోరుతూ దావావేస్తామని సీరం సంస్థ స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గన్న వలంటీర్ ఆరోగ్యంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నామని, అయితే ఆయన అనారోగ్య పరిస్థితికి, వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. ఆయన బహిరంగంగా తప్పుడు విమర్శలు చేస్తూ.. సంస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. వలంటీర్ హానికరమైన, తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది. కాగా, ఈ ఆరోపణలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిఐజి) దర్యాప్తు చేపట్టింది.