అనంతపురం కలెక్టరేట్ : కోవిడ్ టీకాపై ఎలాంటి అపోహలూ పెట్టుకోకుండా 60 ఏళ్లు పైబడిన, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అనంతపురం శివారు ప్రాంతంలోని కిమ్స్ సవీర ప్రయివేటు ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించి, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టే కార్యక్రమంలో భాగంగా కోవిడ్ టీకాను 60 ఏళ్లు పైబడిన, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయివేటు ఆసుపత్రిలో రూ.250కు వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డా||కామేశ్వరప్రసాద్, సవీర హాస్పిటల్ సిఇఒ డా||శ్రీనివాసప్రసాద్, డిఐఒ డా||గంగాధర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, సవీర నర్సింగ్ సూపరిండెంట్ సుమీత జార్జ్ పాల్గొన్నారు.
సవేరాలో వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న కలెకటర్ గంధం చంద్రుడు