Sep 20,2021 00:58

బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న డిఎస్‌పి

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌
సామర్లకోట ఇటిసి, వైటిసి, టిటిడిసి కేంద్రాల్లో భారీగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. పెద్దాపురం డివిజన్‌ పరిధిలోని 12 మండలాల జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఫలితాల లెక్కింపు సందర్భంగా సామర్లకోట ప్రత్తిపాడు సెంటర్‌, పెద్దాపురం సెంటర్‌లో బారికేడ్లు పెట్టి వాహనాల రాకపోకలను నియంత్రించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాలకు వచ్చే రాజకీయ నాయకులు, కార్యకర్తల వాహనాలు, కార్లు రోడ్‌ పక్కన ఆపి నడిచి కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. డిఎస్‌పి అరిటాకుల శ్రీనివాసరావు అధ్వర్యంలో బందోబస్తును పర్యవేక్షించారు.