Feb 01,2021 23:35

గుంటూరుకు వలస వెళ్తున్న చిర్తనకల్‌ గ్రామస్తులు

ఖాళీ అవుతున్న గ్రామాలు
ప్రజాశక్తి - కోసిగి రూరల్‌: 
కోసిగి మండలం నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకు 200 కుటుంబాలు పిల్లాపాపలతో కలిసి వలస వెళ్తున్నారు. సోమవారం దుద్ది, చిర్తనకల్‌, కోలమాన్‌ పేట, జుమ్మలదిన్నె గ్రామాల నుంచి గుంటూరు జిల్లాకు మిరపకాయల కోతకు వలస వెళ్లారు. మండలం నుంచి ఇప్పటికే దాదాపుగా 2000 మంది దాకా గుంటూరు, బెంగళూరు, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వలస వెళ్లారు. రోజురోజుకు మండలంలో వలసలు పెరుగుతున్నా అధికారులు స్థానికంగా ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారు. స్థానికంగా తమకు ఉపాధి చూపిస్తే వలస పోవాల్సిన అవసరం ఉండదని, అధికారులు పనులు చూపాలని చిర్తనకల్‌ గ్రామానికి చెందిన లక్ష్మి అధికారులను కోరారు.