Oct 27,2021 19:27

సాయితేజ్‌ యాక్సిడెంట్‌ అనంతరం సుదీర్ఘ కాలం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. 'సాయి తేజ్‌ రోజురోజుకు మెరుగవుతున్నాడు. గాయాలు మానుతున్నాయి. లేచి కూర్చుంటున్నాడు. మేజర్‌గా జరిగిన ప్యాక్చర్ తరపు గాయాలు కూడా తగ్గుతున్నాయి' అంటూ సన్నిహితులు చెబుతున్నారు. ప్రమాదం పెద్దగా జరగడంతో కోమాలోకి వెళ్లిపోవడం.. కొన్ని రోజుల పాటు అదే స్థితిలో ఉండటంతో శరీరానికి కావాల్సిన పోషకాలు అందక సాయితేజ్‌ బాగా సన్నబడ్డాడని వార్తలు వస్తున్నాయి.