Apr 14,2021 21:19

దుబాయ్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వన్డే బ్యాట్స్‌మన్ల జాబితాలో రెండోస్థానంలో దిగజారాడు అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 26ఏళ్ల కోహ్లి(857రేటింగ్‌) పాకిస్తాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ల మధ్య 8పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉందన్ని పేర్కొంది. టాప్‌లో బాబర్‌ అజమ్‌ ఖాతాలో 865పాయింట్లు ఉండడంతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో బాబర్‌ 82 బంతుల్లో 94 పరుగులు చేయడంతో అతని ఖాతాలో 13 రేటింగ్‌ పాయింట్లు వచ్చాయి. ఇంతకుముందు పాక్‌ తరఫున జాహిర్‌ అబ్బాస్‌(1983ా84), మియాందాద్‌(1988ా89), మహ్మద్‌ యుసుఫ్‌(2003) తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. ఇక టెస్టుల్లో 760పాయింట్లతో 6వ స్థానంలో ఉండగా.. కోహ్లి 814పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టి20ల్లో బాబర్‌ 3లో, కోహ్లి 5వ స్థానంలో ఉన్నారు.