Dec 03,2021 21:07

తొలి టెస్ట్‌ తొలిరోజు ఆటలో కోహ్లీని అవుట్‌గా నిర్ణయించిన విధానం చర్చనీయాంశంగా మారింది. ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌లో పటేల్‌ వేసిన బంతి కోహ్లీ ప్యాడ్లను తాకింది. కివీస్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ అనిల్‌ చౌదరి అవుట్‌గా ప్రకటించాడు. దీంతో కోహ్లి రివ్యూను కోరగా... రివ్యూలో బంతి అతని బ్యాట్‌ను తాకినట్లు కనిపించింది. అయితే ముందుగా ప్యాడ్‌ను తాకిందా? లేక బ్యాట్‌ను తాకిందా? అనే విషయంలో స్పష్టత రాలేదు. దీంతో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే థర్డ్‌ అంపైర్‌ మద్దతు తెలిపి కోహ్లీని అవుట్‌గా ప్రకటించాడు. దీంతో మైదానం వీడే సమయంలో అంపైర్‌తో కాసేపు మాట్లాడిన కోహ్లీ.. బౌండరీ లైన్‌ను బ్యాట్‌తో కోపంగా బాది డగౌట్‌ చేరాడు.