Nov 30,2020 21:35

సమ్మెలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : తమ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్మవరం తాలూకా సిల్క్‌ రీలర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఆదివారానికి ఐదో రోజుకు చేరింది స్థానిక సిరికల్చర్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన సమ్మెకు ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు, సిపిఎం పట్టణ కార్యదర్శి జంగాల పల్లి పెద్దన్న, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌హెచ్‌ బాషా, సిఐటియు నాయకులు ఆదినారాయణ, అయూబ్‌ ఖాన్‌, రైతు సంఘం నాయకులు కొత్తపేట మారుతి ,కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రంగన్న అశ్వత్థ నారాయణ , అమీర్‌బాషా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తాలూకా సిల్క్‌ రీలర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు పసుపులేటి గోవిందరాజులు మాట్లాడుతూ ఎనిమిది నెలలుగా రీలర్లకు ఇన్సెంటివ్‌ రాలేదని దానిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు అచ్యుత సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌ బాషా, షామీర్‌, ఇంతియాజ్‌, ఆలం వలి తదితరులు పాల్గొన్నారు.