Dec 05,2021 19:11

యాత్రలో పాల్గొన్న పాశం సునీల్‌కుమార్‌

ప్రజాశక్తి -గూడూరు :గూడూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర ఆదివారం 35వ రోజు కొనసాగింది. మాజీ శాసన సభ్యులు, పాశం సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గంలో చివరి రోజు యాత్ర గూడూరు రూరల్‌ మండలం, పుట్టంరాజు కండ్రిగ నుంచి బయలుదేరింది. నెర్నూరు గ్రామం, గొల్లపల్లి గ్రామాల మీదుగా వెంకటగిరి నియోజకవర్గమైన బాలాయపల్లి మండలం, వెంకటరెడ్డిపల్లి వరకు సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అడుగడుగునా పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తు న్నారన్నారు. తాము పోలీసులకు సహకారం ఇస్తున్నట్లు తెలిపారు. యాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.