
హైదరాబాద్ : యాక్సెసరీస్ తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ కనెక్ట్ గ్యాడ్జెట్స్ భారత్‌లో మొదటిసారిగా ఫాస్టెస్ట్ చార్జింగ్ పవర్ బ్యాంక్‌ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. జీల్ అల్టిమా పేరుతో 100 వాట్స్‌తో 20,000 ఎంఎహెచ్ సామర్థ్యంతో కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో అమెరికాకు చెందిన సెమికండక్టర్స్ తయారీ దిగ్గజం టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ చిప్‌ను వాడినట్లు పేర్కొంది. దీని ధరను రూ.4,999లుగా నిర్ణయించింది. 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను 50 నిముషాల్లోనే ఇది చార్జ్ పూర్తి చేస్తుందని.. ఇతర పవర్బ్యాంక్స్తో పోలిస్తే మూడు రెట్లు మెరుగ్గా పని చేస్తుందని కనెక్ట్ గ్యాడ్జెట్స్ సిఒఒ ప్రదీప్ యెర్రగుంట్ల తెలిపారు.