Dec 11,2020 22:26

nivalulu arpistunna upadyayulu

కందుకూరి ఉద్యమం ఎందరికో స్ఫూర్తి
తిరువూరు : స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాల కోసం కందుకూరి వీరేశలింగం సాగించిన ఉద్యమం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని, మొదటి వితంతు పునర్వి వాహం జరిపిన సంఘ సంస్కర్తగా ఎందరికో ఆదర్శప్రాయుడని మునుకుళ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.వి.భద్రరావు అన్నారు. మొదటి వితంతు వివాహం జరిగి 139 ఏళ్లు అయిన సందర్భంగా పాఠశా లలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు కందుకూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. 1881 సంవత్సరం డిసెంబర్‌ 11వ తేదీన ఎ.కొండూరు మండలం రేపూడికి చెందిన బాల వితంతువు గౌరమ్మను విశాఖపట్నంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గోగులమూడి శ్రీరాములుకు ఇచ్చి వివాహం జరిపించడం ఆ రోజుల్లో గొప్ప సాంఘిక విప్లవమని భద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హిందీ సంఫ్‌ు అధ్యక్షుడు రేపాక రఘు నందన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.