
కల్యాణపులోవలో పరిశీలిస్తున్న ఎఎస్పి తుహిన్ సిన్హా
కొత్తకోట : కల్యాణపులోవ తిరునాళ్లలో భక్తులకు ఎటు వంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని నర్సీపట్నం ఎఎస్పి తుహిన్ సిన్హా ఆదేశించారు. మంగళవారం కల్యాణ పోతురాజు బాబు ఆలయాన్ని ఆయన సందర్శించారు. వేలా మంది భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ నివారణకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట సిఐ లక్ష్మణ మూర్తి, ఎస్ఐ నాగ కార్తీక్ పాల్గొన్నారు.