May 16,2021 11:19

ముదిగుబ్బ (అనంతపురం) : కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలో చోటుచేసుకుంది. చింతామణి వాసులు పని నిమిత్తం కారులో అనంతపురానికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. అనంతపురం సమీపాన కల్వర్టు నెంబర్‌ 350 వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.