Oct 14,2021 22:56

కలసికట్టుగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం

జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: జిల్లాపరిషత్‌లోని ఉద్యోగులు, రాజకీయ నాయకులు కలిసి జిల్లా కోసం పని చేయాలని అప్పుడే జిల్లా అభివద్ధి జరుగుతుందని జడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా పరిషత్‌లోని వివిధ విభాగాలను జడ్పీ చైర్మన్‌, సీఈవో ప్రభాకర్‌రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది సకాలంలో కార్యాలయంకు చేరుకొని బయోమెట్రిక్‌ విధానంలో హాజరు నమోదు చేసుకోవాలని, సెలవులు కావాలంటే పైఅధికారుల నుంచి ముందే అనుమతి పొందాలని, కార్యాలయంలో విధులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఉద్యోగ నిర్వహణలో ఏదైనా సమస్య ఉంటే జెడ్పీ సీఈఓతో పాటు తనకు కూడా చెప్పవచ్చునని అన్నారు. సమన్వయంతో కలిసి పనిచేసి జిల్లాను అభివద్ధి పథంలో నడిపించి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిపేందుకు అందరం కలిసి పనిచేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివద్ధికి కషిచేయాలని జిల్లాలో పలు అభివద్ధి పనులకు జిల్లా పెద్దలు రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివద్ధి మరియు మైనింగ్‌ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సహకారం తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో వర్షాలు బాగా పడుతున్నాయని, సాగునీరు తాగునీరు సమస్యలు కొంతవరకు తీరాయని జిల్లాను వ్యవసాయ పరంగా , పరిశ్రమల పరంగా అభివద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవోతో పాటు పలువురు జడ్పీటీసీలు అధికారులు పాల్గొన్నారు.