May 18,2021 22:21

నూతన చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిస్తున్న మేయర్‌, ఎమ్మెల్యేలు

ప్రజలందరూ సహకరించాలి
నూతన చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన మేయర్‌, ఎమ్మెల్యేలు
ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌: 
కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంగా కర్నూలు నగర పాలక సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. మంగళవారం సాయంత్రం సంకల్‌ బాగ్‌ ప్రాంతం వద్ద కర్నూలు నగర పాలక సంస్థ కొనుగోలు చేసిన 10 చెత్త సేకరణ ఆటోలు, ఒక హిటాచి వాహనాలను కర్నూలు నగర మేయర్‌ బి.వై రామయ్య, పాణ్యం, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, హఫీజ్‌ ఖాన్‌, సుధాకర్‌, కమిషనర్‌ డి.కే బాలాజీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరంలో చెత్త సేకరణకు మరో పది వాహనాలు, ఒక హిటాచిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ బాధ్యతగా తడి పోడి చెత్తలను విడివిడిగా చెత్త సేకరణ వాహనాలకు ఇవ్వాలని కోరారు. బయట చెత్త కుప్పల్లో చెత్త వేయవద్దని విజ్ఞప్తి చేశారు. స్వచ్చ కర్నూలులో భాగంగా ఈ వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో 49వ వార్డు కార్పొరేటర్‌ కృష్ణకాంత్‌, డిప్యూటీ కమిషనర్‌ పద్మావతి, ఎస్‌ఈ. పాండురంగారావు, ఎంహెచ్‌ఓ భాస్కర్‌ రెడ్డి, ఏఈ దినేష్‌, శానిటరీ ఇన్స్పెక్టర్లు అనిల్‌, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.