Mar 02,2021 23:18

సర్పంచి మూలింటి రాధమ్మను సన్మానిస్తున్న ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు

- సర్పంచి రాధమ్మ
ప్రజాశక్తి - ఆస్పరి: 
మంత్రి గుమ్మనూరు జయరాం సహకారంతో ఆస్పరిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని సర్పంచి మూలింటి రాధమ్మ తెలిపారు. మంగళవారం సర్పంచి రాధమ్మను ప్రిన్సిపల్‌ లక్ష్మీ నరసింహ, అధ్యాపకులు సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడారు. కళాశాలలో అధ్యాపకుల కొరతతో పాటు విద్యార్థులు ఆడుకోవడానికి క్రీడామైదానం, కాంపౌండు వాల్‌ నిర్మాణం, అదనపు గదులు సమస్యలు కళాశాలను వేధిస్తున్నాయని తెలిపారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలక వర్గం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన సర్పంచి మూలింటి రాధమ్మ మాట్లాడుతూ... విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం నుంచి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని చెప్పారు. అనంతరం ప్రిన్సిపల్‌ను పూలమాలలతో సన్మానించారు. సొసైటీ చైర్మన్‌ కేశవరెడ్డి, వైసిపి జిల్లా సంయుక్త కార్యదర్శి గోవర్ధన్‌, నాయకులు మూలింటి రాఘవేంద్ర, అశోక్‌, కృష్ణ కాంత్‌, శ్రీరాములు, శేఖర్‌, శీనప్ప, నర్సప్ప, మహేష్‌ పాల్గొన్నారు.