Mar 02,2021 23:34

సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు.

ప్రజాశక్తి - శిరివెళ్ల: మండలంలోని గంగుల తిమ్మారెడ్డి జూనియర్‌ కళాశాల అభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ కృషి చేయాలని ప్రిన్సిపల్‌ పివి రామన్‌ కోరారు. మంగళవారం కళాశాలలో ఇంటర్‌మీడియట్‌ విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ పివి.రామన్‌ మాట్లాడారు. మన బడి నాడు-నేడు పథకంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్‌ పివి.రామన్‌, తల్లిదండ్రుల కమిటీ ప్రెసిడెంట్‌గా తిరుపతి రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌గా చిన్న వెంకటయ్యను ఎన్నుకున్నారు. సభ్యులుగా మహబూబ్‌ బాషా, అంకాలమ్మ, శివసింగారి, సూర్యుడు, సురేష్‌, మాలిబాషా, లక్ష్మీ నారాయణ, దేశమయ, సుభాష్‌లను ఎన్నుకున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యులు కళాశాలలో జరిగే నాడు-నేడు అభివృద్ధి పనులలో భాగస్వాములుగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, అధ్యాపకలు, సిబ్బంది పాల్గొన్నారు.