
అభిషేక్ బచ్చన్ నటిస్తోన్న థ్రిల్లర్ సినిమా బాబ్ బిస్వాస్ షూటింగ్ ప్రారంభమైంది. 'కహానీ' చిత్రంలోని కాంట్రాక్ట్ కిల్లర్ బాబ్ బిస్వాస్ పాత్రలో అభిషేక్ నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సుజోరు ఘోష్ దర్శకత్వంలో వచ్చిన కహానీ చిత్రంలోని కోల్డ్ బ్లడెడ్ కిల్లర్‌గా బిస్వాస్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రముఖ బెంగాలీ నటుడు సస్వతా ఛటర్జీ పోషించిన ఈ పాత్రలో తాజగా అభిషేక్ నటించనున్నారు. ఇందుకోసం ఫుల్ స్లీవ్ చొక్కా, పెద్ద కళ్లజోడు, మిడ్ పార్టీషియన్ జుట్టుతో కనిపిస్తున్న అభిషేక్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.