Oct 28,2021 17:06

ప్రజాశక్తి -నందికొట్కూరు
సరాదాగా ఈతకెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంఘటన నందికొట్కూర్‌ మండలంలోని కేసీ కెనాల్‌లో గురువారం చోటుచేసుకుంది. నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామ సమీపంలో ఉన్న కేసీ కెనాల్‌లో సరదాగా అడుకునేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సేకరించిన వివరాల ప్రకారం ఫకీరన్న, రామేశ్వరి దంపతుల కుమారుడు విశాల్‌ (13 ) , మరియమ్మ లేట్‌ మహేష్‌ల కుమారుడు రమేష్‌(8 ) , సంజీవనాయుడు రామేశ్వరి దంపతుల కుమారుడు శరత్‌(9) లు మృతిచెందారు.వీరు ముగ్గురు ఈతకు వెళ్లి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్థర్‌, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముగ్గురు చిన్నారుల భౌతిక దేహాన్ని సందర్శించి, సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు.అనంతరం మృతుల కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం చేశారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం, ఆవశ్యకత గురించి అధికారులకు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు గ్రామ వైసిపి నాయకులుప్రభాకర్‌ రెడ్డి, పాపన్న వైసిపి, రవీంద్ర నాయుడు వైసిపి నాయకులు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ హాజీ అబ్దుల్‌ షుకూర్‌ మియా, మండల తహశీల్ధార్‌ రాజశేఖర్‌ బాబు, ఉండవెల్లి ధర్మారెడ్డి, బ్రాహ్మణ కొట్కూరు సర్వోత్తమ రెడ్డి, మల్యాల శంకరయ్య, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.