Oct 28,2021 11:48

ప్రజాశక్తి నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలో అల్లూరు గ్రామ సమీపంలో ఉన్న కేసు కెనాల్‌కు సరదాగా ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లి మత్యు ఒడిలోకి చేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్థర్‌, ముగ్గురు చిన్నారుల భౌతిక దేహాన్ని సందర్శించి, సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియ జెసి, తక్షణ మే ఆర్థిక సహాయం అందజేశారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం, ఆవశ్యకత గురించి అధికారులకు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు గ్రామ వైసిపి నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ హాజీ అబ్దుల్‌ షుకూర్‌ మియా, మండల తాసిల్దార్‌ రాజశేఖర్‌ బాబు, ఉండవెల్లి ధర్మారెడ్డి, బ్రాహ్మణ కొట్కూరు సర్వోత్తమరెడ్డి, మల్యాల శంకరయ్య, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కనల్ 3

 

కనల్ 2