
తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ''నాకు స్వల్ప జ్వరం ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను. ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి'' అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విజయన్ కన్నూర్‌లోని తన నివాసంలో ఉన్నారని, చికిత్స నిమిత్తం కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాగా, విజయన్‌తో పాటు ఆయన కుమార్తె వీణా విజరుకు, అల్లుడు పి.ఎ మహమ్మద్ రియాస్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 6న ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయన్ రాష్ట్రపవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు.