Nov 29,2020 23:36

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : ఢిల్లీలో రైతులపై లాఠీఛార్జికి నిరసనగా మండలపరిధిలోని ఉప్పుగుండూరు బస్టాండ్‌ సెంటర్‌లో రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్‌కె.మాబు, జె.జయంతి బాబు మాట్లాడుతూ రైతులను దెబ్బతిసే విధంగా కేంద్రం ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసహరించుకోవాలని కోరుతూ ఐదు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్తుండగా వారిపై వాటర్‌, బాష్పావాయువు ప్రయోగించం దారుణమన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తుండగా ఆంధప్రదేశ్‌లో అధికారి వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు మద్దతు తెలుపడం దారుణమన్నారు. ఢిల్లీలో రైతులపై జరిగిన ఘటనను ఏ రాజకీయ పార్టీ ఖండించక పోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి జి.బసవయ్య పున్నయ్య, సిపిఎం మండల కార్యదర్శి టి. శ్రీకాంత్‌, వాసు, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, ప్రసాద్‌, రైతులు పాల్గొన్నారు.