Nov 26,2020 19:46

కన్నడ నటుడు యష్‌ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం.. 'కేజీయఫ్‌'కు సీక్వెల్‌ వస్తోన్న 'కేజీయఫ్‌ చాప్టర్‌ 2'. స్వల్ప విరామం తర్వాత ఫైనల్‌ షూట్‌కు సన్నద్ధం అయినట్లు తెలిపింది. ఈ చిత్రం ఫైనల్‌ షెడ్యూల్‌ని పూర్తి చేయడానికి యష్‌ హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజరు దత్‌ అధీరా అనే పవర్‌ ఫుల్‌ రోల్‌లో నటిస్తుండగా హోంబేల్‌ ఫిల్మ్స్‌ వారు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.