
ప్రజాశక్తి - ఆలమూరు 'ప్రభుత్వ సంక్షేమ పథకాలను న్యూస్ ఛానల్ ద్వారా ప్రచారంతోపాటు, ప్రజలకు వినోదంతోపాటు విజ్ఞానం, ఆనందాన్ని నింపే తమపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల (జెఎసి) ప్రతినిధి పసలపూడి సీతారామయ్య అన్నారు.' మండలంలోని చొప్పెల్లలో కేబుల్ ఆపరేటర్ల మండల కన్వీనర్ మద్దిరెడ్డి మాణిక్యాలరావు అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎపిఎస్ఎఫ్ఎల్ (ఎపి ఫైబర్) ద్వారా ప్రచారం జరుగుతోందన్నారు. కానీ 30 ఏళ్లుగా ఏ ప్రభుత్వమొచ్చినా కేబుల్ ఆపరేటర్లను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒఎల్టి ఆపరేటర్లకు తక్షణం బాక్సులను అందించి, ఎపి ఫైబర్‌కి తక్షణం నిధులను సమకూర్చాలన్నారు. ఎల్సిఒ, ఎంఎస్ఒ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్యాకేజీలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్‌కూ వృత్తి పన్ను సేల్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. ఎపిఎస్ఎఫ్ఎల్ నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెను భారంగా ఉన్న ఫోల్ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేయాలని, కేబుల్రంగంపై జిఎస్టి ట్యాక్స్‌ను ఐదు శాతానికి తగ్గించాలన్నారు. అలాగే ప్రతి కేబుల్ ఆపరేటర్‌కూ ప్రభుత్వ బీమా కార్డు సదుపాయం కల్పించాలన్నారు. ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు వినతిపత్రాలు అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డి.పెదకాపు, సిహెచ్.నాగు, పి.ఏసు, ఎం.శ్రీను పాల్గొన్నారు.