May 04,2021 16:53

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కి ప్రాధాన్యత ఇవ్వాలని.. ప్రధానంగా 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి అని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇక వ్యాక్సినేషన్‌పై ప్రధానికి లేఖ రాయాలి అనే దానిపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా.. కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ తెప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇక రేపటి నుంచి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ బస్సులను కూడా మధ్యాహ్నం 12 తర్వాత నడపకూడదని నిర్ణయించింది.