Nov 26,2021 07:14

లక్నో: బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో కదులుతున్న కారులో ఓ బాలికపై లైంగికదాడి జరిగింది. సోషల్‌ మీడియా ద్వారా పరిచయం చేసుకున్న బాలికను కారులో తీసుకెళ్తూ, ఒక వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైంగికదాడి అనంతరం బాధితురాలిని మధురలోని కోసికలాన్‌ ప్రాంత శివార్లలో పడేశారని రూరల్‌ ఎస్‌పి శ్రీష్‌ చంద్ర తెలిపారు. ప్రధాన నింధితుడైన తేజ్‌వీర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సహకరించిన మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.