Apr 13,2021 16:05

ఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రసిద్ధి గాంచిన కబీరా మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా సరుకు తరలించేందుకు వీలుగా దీనిని రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. కబీరా మొబిలిటీ హెర్మ్స్‌ - 75 అనే హైస్పీడ్‌ ఈ స్కూటర్‌ను తయారుచేసింది. ఒకసారి చార్జింగ్‌ చేసిన తర్వాత ఫిక్స్‌డ్‌ బ్యాటరీ అయితే 120 కిలోమీటర్లు, స్వాపేబుల్‌ బ్యాటరీతో 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఈ స్కూటర్‌ ప్రయాణిస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ రెండు ఎలక్రిక్‌ బైక్‌లు, ఆరు స్కూటర్ల మోడళ్లున్నాయి. ప్రస్తుతం తయారు చేసిన మోడల్‌ గోవా ఎక్స్‌షోరూంలో రూ.89,600లు పలుకుతోంది. పర్యావరణ అనుకూల మొబిలిటీ పరిష్కారాలను అందిస్తుంది.